ఋషి (ఋషేంద్ర)
వేదాలు చదివిన జ్ఞాని కాడు వీడు కాని వేదాలకే పాఠం చెప్పే జ్ఞాని వీడు. పొట్ట విప్పితే అక్షరం ముక్క రాదు వీడికి , కాని అక్షరానికి అర్ధం చెప్ప గలవాడు వీడు.అమ్మజొల పాట తెలియదు అమ్మ వెచ్చని ఒడి తెలియధు, అమ్మ తినిపించే కమ్మని గోరుముద్దలు తెలియవు కాని అమ్మ అంటే గౌరవం. వాడే వీడు ఋషి కాలనికి అందని జ్ఞాని వీడు.
మనలొ నూటికి తొంబ్బై మంది జీవితం అంటే ఎమిటో దాని అర్దం ఏమిటో తెలిసిన వారు వున్నారు. మిగిలిన 10 మందిలొ ఇద్దరు దేశానికి హాని చెయని వారు ఉండగా మరొ ఇద్దరు ఈ తొంబ్బై మందిలో 40 మందిని చెడకొట్టడానికి వారిని ధగాచెయ్యడానికి పుట్టివున్నారు. మరోముగ్గురు అందరికి హాని చేస్తూ పెద్దమనుసులకింద చలామని అవుతున్నారు. మిగతా ముగ్గురు కాలానికి లెక్కలు కడుతూ జీవితాన్ని గడుపుతూ తమకు జరిగిన కష్టనష్టాలను తలచుకుంటూ ఇక ఇంతే అని కూర్చుని వుంటారు.ఈ వందమందిలో మిగిలినది ఒక్కడు(అతడు లేద ఆమె)వాళ్ళకు అంతా తెలుసు కాని ఏమి తేలియని వారిలా ఇటు మంచికి చెడుకి అర్దం చెబుతూ మంచిని సమర్దించే ఒక్కడు వాడు, వాడే వీడు మన ఋషి మనలొ తిరుగుతూ అందరిచేత మాటలు పడుతున్నా చెదరని చిరునవ్వుని చిందించే వాడే ఋషి. ఎవ్వరకి అర్దంకాని వాడు ఎవ్వరని లెక్కచేయని వాడు, వాడే ఋషి. తన పని తనదే దేనికి బయపడడు ఒక్క అకలికి తప్ప.
అంటినా అంటని నిప్పు వాడు, చెమ్మగిల్లే మనసుకి ఓదార్పు వాడు, అనాటి ఋషులు యజ్ఞం చేస్తే వానలు పడేవి కాని వీడికి యజ్ఞొపవేశాల్లొ అనుభవం అవసరం లేదు , మరి దేని గురుంచి యజ్ఞం చేస్తాడు ఎందుకు యజ్ఞం చేస్తాడు. వాడికి అన్నీ ఉన్నా ఎమి లేని వాడు. అలాంటి వాడు దేని గురుంచి యజ్ఞం చేయాలి.
ఈ ప్రంపంచంలో ఒకటిపొందాలి అంటే ఒకటి విడవాలి అన్న కలి నియమం వచ్చిన రోజులు ,అక్షరం ముక్క రాని వాడు యజ్ఞం చేయడం ఏమిటి? ఈ కాలంలొ ఋషులు ఏమిటి? అని అంటార వాడు దేని గురుంచి యజ్ఞం చేసాడో దానివల్ల ఏమి పొందాడో ఏమి పోగొట్టు కున్నాడో సవివరంగా చెబుతాను.
వాడు చేసిన యజ్ఞం పేరు "ప్రేమయజ్ఞం" ప్రేమను ప్రేమించడానికి యజ్ఞం, నా అంటూ లేనివాడికి ఏర్పడిన ఒక తియ్యని అనూభూతి "ప్రేమ" దాన్ని పొందడానికి చేసిందే ఈ యజ్ఞం.
ఋషి పూర్తి పేరు ఋషేంద్ర పేరు పెట్టింది ఒక పేదరాశి పెద్దమ్మ కావచ్చు కాని వాడికి అమె అమ్మ. పుట్టింది కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి కాదు మనుషులు జంతువులుగా తిరిగే మహానగరంలో, అది ఒక ధనిక కుటుంభంలో వాడు పుట్టగానే అస్తిపొయింది అని తల్లిదండ్రులచే విసిరివేయ బడ్దాడు. వాడు పుట్టినది శివునికి ఇష్టమయిన మహాశివరాత్రి రోజున జన్మించాడు కాబట్టి వాడికి శివుడి అండ పుష్కలంగా లబించబట్టే బ్రతికాడు. వాడిని విసిరి వేసిన చెత్తకుప్ప వాడికి ఉయ్యాలగ మారింది, కాటు వేసి విషం కక్కే విషనాగు పడగ విప్పి వాడికి గొడుగు పట్టింది.
అప్పుడే అటుగా వచ్చిన చెత్త ఏరుకొని బ్రతికే ఒక ముసలావిడ కంట పడ్డాడు, పాపం ఆమే కూడ ఒక అనాదే. బొమ్మ అనుకుని పాముతొ అడుకుంటున్న ఋషిని చూసి చలించి పోయింది తనతొ పాటు తన పూరి గుడిసెకు తీసుకు వచ్చింది, తీసుకురావడం అయితె తెచ్చింది కాని ఋషి వెంట ఉన్న పామును తలుచుకొని బయపడ సాగింది. అందుకే తెలవారుతూనె తనకు తెలిసిన చిన్నయ్య సాములోరి దగ్గరకు తీసుకు వెల్లింది. సాములోరికి ఆ బిడ్డ ఎక్కడ ఏ పరిస్థితిలొ దొరికాడొ చెప్పి చిన్నయ్య సామి ఏమి చెయమందువు సామి అని అడిగింది. వాడి చేయి చూసి చూడు అమ్మ వీడు నాకే పాఠాలు చెప్పగలవాడు అవుతాడు అని ఒక చిరునవ్వు నవ్వి వీడికి ఏ దోషం లేదు మహ జాతకుడు అని పసికందు నుదిటిన విభూదిని రాసి వీడు అందరకి పాఠాలు చెప్పగలవాడు కాబట్టి ఋషేంద్ర అని పిలవచ్చు అని చిరునవ్వు నవ్వి ఆశీర్వదించి పంపివేసాడు…
ఋషికి పది సంవత్సరాలు నిండే సమయానికి ఋషి అని ప్రేమగా పిలిచే ఆ ముసలిదే అన్నీ తనకు, అమ్మ అనే పదానికి తొలి పలికరింపు అయిన తను కూడా చనిపోయింది, చందమామను చూపి గోరుముద్దలు పెట్టే తల్లి చనిపోయే సరికి, తనను ఎవరో నిలువునా చీల్చిన బాధ ఎన్ని రాత్రులు ఏడ్చాడో తెలియదు, ఎప్పుడు సొమ్మసిల్లి పడిపొయాడో తెలియదు, చిన్నయ్య సాములోరు ఏడుస్తున్న తనను ఎప్పుడు తెచ్చారో కుడా తెలియధు. ఋషి అన్న పిలుపుకి కల్లు తెరచి చూసేసరకి చిన్నయ్య సామి కనిపించారు. అతను ఎవరో తనకు తెలియక పోయిన నేను ఎవరో తనకు తెలుసు కాబోలు అని అనుకున్నాడు. బాదపడకురా కన్నా నిన్ను కన్నవారు నిన్ను ఆదరించక పోయినా ఈ ముసలిది నిన్ను సాకింది. ఆమె రుణం ఇంతవరకే, నాతో రా అని తన వెంట తీసుకు వెళ్ళాడు...
గోపాలం మాష్టారు వీడి పేరు ఋషేంద్ర అనాధ నా అన్నవారు లేరు మీఅనాధ అశ్రమంలో చేర్చుకొండి అని ఋషి తాలుక అన్ని విషయాలు చెప్పి వెల్లబోతు గోపాలం మాష్టారు ఒక్క మాట, వీడికి తను ఎవరు అన్న ప్రశ్న కలిగినప్పుడు నా అశ్రామానికి పంపించండి అంతవరకు మీదగ్గరే ఉంచండి అని తన ఆశ్రమానికి వెల్లిపోయాడు....
తన చుట్టూ ఒక చిన్నలోకం ఏర్పడింది ఆకలి అన్న మాట మరచిపోయాడు ఋషి, కాని తనను పెంచిన ఆ ముసలి అవ్వను గురుంచి ఆలోచించేటప్పుడు మాత్రం మౌనంగా ఒక మూల కూర్చొని రోధించే వాడు. అలా ఒకసారి బాధపడుతున్న ఋషిని గోపాలం మాష్టరు చూసారు దగ్గరకి పోయి ఋషి అని పిలిచాడు పలకలేదు, మల్లీ ఋషి అని పిలిచారు ఈ సారి నెమ్మదిగా తల ఎత్తి తన వైపు చూసాడు ఏమి అయింది అని ప్రేమగా అడిగారు గోపాలంమాష్టారు ఏమి లేదు అని సమాదానమిచ్చాడు ఋషి.. మరి దేని గురుంచి ఈ కన్నీళ్ళు....మా అమ్మ గురుంచి అని సమాదానం ఇచ్చాడు ఋషి. మీ అమ్మ ఎక్కడ ఉందో తెలుసా అని అడిగారు గోపాలంమాష్టారు ఋషి తల నిమురుతు ,, చనిపొయింది అని సమాదానం ఇచ్చాడు ఋషి.... మీ అమ్మ చనిపోయింది అనే బాధ పడుతున్నావ అని అడిగారు గోపాలంమాష్టారు. లేదు మాష్టారు నాలా ఎంతమంది భాధ పడుతున్నారో అని తలచుకొని బాధ పడుతున్నా మాష్టారు అని జవాబు ఇచ్చాడు ఋషి ...ఒక్కసారి అవాక్కయ్యారు గోపాలంమాష్టారు..
ఋషి అందరూ ఆడుతు ఆనందంగా ఉంటే నువ్వు మాత్రం ఏమిటి ఇలా కూర్చొని ఆలోచించడం అని ఆప్యాయంగా అడిగారు గోపాలంమాష్టారు లేదండి మాష్టారు నేను ఇక్కడకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయ్యింది, ఈ నాలుగేళ్ళలో నాకు తెలిసింది ఏమిటి అంటే నేను ఒక అనాధను అని నాకు అనాధ అన్న పధానికి అర్దం తెలియకపోయిన ఎవ్వరూ లేని వారు అని అర్దం అయింది....అయితే ఎవ్వరూ లేకపోతే నేను అన్న వాడను ఎక్కడి నుంచి వచ్హాను ఇక్కడ వున్నవాల్లు అందరూ ఎక్కడి నుంచి వచ్చారు అసలు నేను ఎవరిని అన్న ప్రశ్నలు నన్ను వేధిస్తున్నాయి. ఇంతకీ నా తల్లిదండ్రులు ఎవ్వరు అని అడిగాడు ఋషి మాష్టారుని....
గోపాలంమాష్టారుకి అర్దం అయింది ఋషి తన గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు అని, అప్పుడు తనకు ఋషిని అప్పగించి వెళ్ళిన చిన్నయ్యస్వామి గుర్తుకు వచ్చాడు గోపాలంమాష్టారుకి...ఋషి నీ ప్రశ్నలకి జవాబు ఇచ్చేవాడు చిన్నయ్యస్వామి ఒక్కరే, ఎవరతను మాష్టారు అని అడిగాడు ఋషి ... నిన్ను ఇక్కడ చేర్చింది అతనే.. అతనికి నిన్ను అప్పగిస్తాను ఈ రోజుకు భోజనం చేసి పడుకో ఎక్కువగా ఆలోచించవద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు గోపాలంమాష్టారు .....
Part-2
నీవు అమ్మ అనుకున్న ఆ తల్లి, నిన్ను ఎవరో చెత్తకుప్పలో వదిలి పోగా ఆమె తెచ్చి పెంచింది అంటే ఆమె నీ ప్రాణధాత, నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో ఆ దేవుడికే తెలుసు అని చెప్పడం ఆపి ఋషి వంక చూసాడు చిన్నయ్యస్వామి అతని మాటలు విన్న ఋషి ఏదో ఆలొచించడం చూసి ఏమిటి ఋషి ఏమిటి ఆలొచిస్తున్నావు నాయనా అని అడిగాడు. ఋషి ఏమి లేదు స్వామి నన్ను కన్న తల్లిదండ్రులను ఊహించుకుంటున్నాను. వారు ఎలాగ ఉంటారు అని ఆలోచిస్తున్నాను. మరి వారి మీద నీకు కోపం రాలేదా? ’లేదు స్వామి’ వారి మీద నాకు ఎందుకు కోపం వారు ఎవ్వరైనా నన్ను కన్నవారు కాబట్టే నాకు కోపం లేదు.కాని ఒక్కటే అర్థం కావడం లేదు అక్కడ చూడండి అని అక్కడే వున్న పార్వతీపరమేశ్వరులు ఫోటో వంక చూపించి అలాగే వుంటారు నా తల్లిదండ్రులు అని ఒక్కసారిగా లేచి అక్కడనుంచి వెళ్ళిపోయాడు ఋషి. కాని అతని మనస్సులో జరుగుతున్న సంఘర్షణ వేరు అతని ఆలోచన వేరు తన వారి గురుంచి వెతకాలి అన్న తపన కాదు. తనను విసిరి వేసినందుకు కోపం లేదు కాని మనుషులు అందరూ ఒకేవిదంగా ఎందుకు ఆలోచించరు, అనే చింతన తప్ప. ఇంక ఏమి లేదు అందరూ ఒకేవిదంగా ఆలోచిస్తే ఈ వదిలి వేయడాలు ఇక ఉండవు. ఎంతో మంది తను అనాధ ఆశ్రమంలో ఉండగా అక్కడ వున్న వారిని దత్తత తీసుకోవడం చూసాడు అంటే అందరి మనస్తత్వాలు ఒకలాగ వుండవు అన్నమాట. ఇంతకి తనవాళ్ళు తనను ఎందుకు వదిలి వేసారు తనని ఒక్కసారి తీక్షణంగా పరీక్షించుకున్నాడు. తనని పెంచిన ఆ పేదరాశి పెద్దమ్మ తనని చక్కనిచుక్కవురా, ఆ చుక్కల్లో చంద్రుడివిరా అని దిష్టి తీయడం తెలుసు. మరి తనని ఎందుకు వదిలివేసి వుంటారు అన్న ప్రశ్నలను తనకి తానే వేసుకుని వాటికి సమాదానం దొరకక వాటి గురుంచి తలచుకొని భాదపడటం కంటే వాటి గురుంచి తన తల్లిదండ్రులు గురుంచి మరచి పోవడం మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఋషి.....
ఈ ఆలోచనలతోనే సగం కాలం గడిచి పోయింది. ఈ కాలక్రమంలో తనకు బుద్దులు చెప్పిన చిన్నయ్యస్వామి కూడా చనిపోయడు. ఇప్పుడు పదెల్ల ప్రాయం గల ఋషేంద్ర కాదు వుడుకు రక్తంతో ఆలోచించే 26 ఏళ్ళ ప్రాయంగల ఋషి అక్షరజ్ఞానం లేకపోయినా లోకజ్ఞానం వుంది. లక్షలు లేకపోయినా అవి సంపాదించే తెగువ దైర్యం పట్టుదల మెండుగా వున్నాయి. తన చుట్టూ మొదట వున్న పేదరాశిపెద్దమ్మ ఆ తర్వాత అనాధ ఆశ్రమం చివరగా చిన్నయ్యస్వామి గుర్తుకు వచ్చారు. వీరు అందరూ తను ఎదగడానికి దోహద పడిన వారు ఇక నుంచి తనకు తానుగా బ్రతకాలి ఓంటరిగా జీవితం గడపాలి అన్న భయం లేదు.ఎందుకంటే జీవనగమనంలో ఎవరో ఒకరు తోడు దొరకక మానరు. తను పొందలేని ఆత్మీయత అనురాగాలను పొందక మానను అన్న దీమా వుంది. ఇక నుంచి పారేటి సెలయెళ్ళు చప్పుడ్లు వుండవు. ఈ పచ్చదనం కనిపిస్తుందో లేదో తెలియదు. కాని చిన్నయ్యస్వామి చెప్పింది ఒక్కటే ’ నీకు ఎప్పుడు జ్ఞానబోధ కావాలి అని అనిపిస్తే అప్పుడు మరలా ఈ ఆశ్రమానికి రమ్మని’ చెప్పాడు. అంటే ఈ చిన్ని ప్రపంచానికి ఆ పెధ్ద ప్రపంచానికి తేడా వుంది అని స్పష్టంగా తెలుస్తుంది. తను వున్నది అరకు లోయలో వున్న ఎవరికీ తెలియని చిన్న ప్రపంచం. కాని ఈ చిన్న ప్రపంచంలో తను ఎన్నో విషయాలని తెలుసుకున్నాడు. మనిషి యొక్క విలువలు గురుంచి తెలుసుకున్నాడు ఇక స్వశక్తితొ భ్రతకాలి తన గురువు తండ్రి అయిన చిన్నయ్యస్వామి వారి మట్టి విగ్రహనికి వినయంగా నమస్కరించి తను ఏంచుకోబొతున్న మార్గం గురించి అలొచించు కుంటూ అక్కడి నుంచి కదిలాడు ఋషి....
విశాఖపట్నం అని బస్సు మీద రాసివున్న పేరును చదివి అంటే నా మొదటి ప్రయాణం విశాఖపట్నం వైపు అన్న మాట, అని బస్సు లోపలికి ఎక్కి కుర్చున్నాడు. భుజానికి ఒక సంచి అందులొ ఒక పిల్లనగ్రొవి, ఒక కుంచె మరియు తను ఎంతో ఇష్టపడి వేసిన రమణీయమైన చిత్రాలు అందులొ ఉన్నాయి. అవి తన దగ్గరకి ఎలాగ వచ్చాయో తలుచుకొసాగాడు ఋషి....
చిన్నయ్యస్వామి తనకు చెప్పిన మాటలలో మోదటిది మానవ నిర్మిత నగరంలో మనుగడ సగించడానికి కావలసింది డబ్బు కాని డబ్బే సర్వస్వం కాకూడదు. తను ఆశ్రమం నుండి బయలు దేరిన తరువాత కొన్ని బట్టలు తప్ప ఏమీ లేవు. మూడు గంటల కాలి నడక తరువాత గడిచిన ౧౫ ఏళ్ళలో తను మొదటిగా చూసిన కొద్దిగా జనసంచారం గల ’అరకు’ ఊరిలో వున్నాను అని తెలుసుకున్నాడు...తన ఎదురుగా కొంచెం దూరంలో ఒక ముసలి వాదు చెట్టు మ్రానుని గొడ్డలితో నరుకుతూ కనిపించాడు కాని ఆ పని అతని వల్ల అవ్వడం లేదు అది చూసి ఋషికి జాళివేసింది. అతని దగ్గరికి పోయి ఇలా ఇవ్వు తాత నేను కొట్టి పెడతాను అని అతని దగ్గరనుండి గొడ్డలి తీసుకొబోయాడు అందుకు అతను లేదు మనవడా నీ సహాయం అవసరం లేదు నా పని నేను చేసుకోగలను అని తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. ఇంతలో ఆ ముసలివాడికి ఏమయిందో ఏమో వున్నటుండి సొమ్మసిల్లి పడిపోయాడు. ఋషి తన దగ్గర వున్న నీల్లను అతని ముఖము మీద జల్లి కొంచెం త్రాగించి ఒకపక్కన పడుకోబెట్టాడు. ఋషి కి ఆ ముసలివాడికి సాయం చేద్దాం అని పక్కనే వున్న గొడ్డలిని తీసుకొని గంటలో బండెడు కట్టెలు కొట్టి పక్కనే వున్న ఎడ్లబండ్లో పేర్చాడు. ఇంతలో ముసలివాడికి మెలుకువ వచ్చి చూసేసరికి తన కల్లను తనే నమ్మలెకపోయాడు. నాయనా నేను వారం మొత్తంలో కొట్టే కట్టెలను నువ్వు గంటలో కొట్టావు వీటిని అమ్మితే ఎంత సొమ్ము వస్తుందో తెలుసా? ఎంత వస్తుంది ఎమిటి అని అడిగి ప్రక్కనే ఉన్న బండరాయి మీద చతికిలపడ్డాడు అలసటతొ. ఇంచుమించు ౧౫౦ రూపాయలు వరకు వస్తాయి అని సమాదానం ఇచాడు ముసలివాడు. డబ్బు అన్న మాట వినగానే తను కొద్దిరోజులు బ్రతకడానికి కావలసిన డబ్బులు ఇక్కడే సంపాధించుకోవాలి అన్న ఆలోచన వచ్చింది ఋషికి. ఐతే తాత ఒక పని చెయ్ నేను ఇంకొన్ని చెట్లను కొట్టి పెడతాను అవి అమ్మిపెట్టి నువ్వు సగం డబ్బులు తీసుకొని మిగతా సగం నాకు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఋషి అలా ఒక వారం రోజుల పాటు కస్టపడి ఒక రెండువేల రూపాయల వరకు సంపాధించుకున్నాడు. ఆ విధంగా వచ్చిన డబ్బులతో తనకు నచ్చిన ఒక పిల్లనగ్రోవిని, కుంచే, వివిద రకాల రంగులు, కొన్ని చార్టులను తీసుకున్నాడు....
ఈ వారం రోజులలో తను ఇక్కడ బ్రతకడానికి రోజుకి ఎలా లేదన్నా ముప్పై నుంచి ఏభై రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలుసుకున్నాడు. అదే పెద్ద పట్టణంలో ఐతే రెట్టింపు ఖర్చు అవుతుందని గ్రహించాడు. ఆ ముసలి వాడితో మట్లాడే సమయంలో ఇక్కడికి ౧౨౦ కిలోమీటర్ల దురంలో విశాఖపట్టణం అనే ఊరు వుందని తెలుసుకున్నాడు. అక్కడ పని చెయ్యడానికి అన్ని అవకాసాలు వున్నాయని తెలుసుకున్నాడు... అక్కడ మనుగడ సాగించాలి అంటే ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బులు సమకూర్చుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. అందుకొసం ఇంకొ రెండు వారల పాటు కష్టపడి మొత్తం పది వేల రూపయల వరకు సమకూర్చుకున్నాడు. ఇక తను అక్కడ కొద్ది రోజులు జీవించడానికి సరిపోతుంది అన్న నిర్ణయానికి వచ్చిన తరవాత ఇక నేను విశాఖపట్నం వెలతా తాత అని ముసలివాడికి చెప్పాడు . అలాగే మనవడా క్షేమంగా వెళ్ళిరా అని దీవించి మనవడా అన్ని వెళలా మంచితనం పనికి రాదు కొన్ని చోట్ల కరుకుగా వుంటేనె పని జరుగుతుంది అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోయాడు అతని చివరి మాటలు మాత్రం తనకు ఆసమయంలొ అర్దం కాలేదు....
ఒక్కసారిగా గల్లుగల్లు మని గజ్జెల మువ్వల సవ్వడి విని ఈ లొకంలొకి వచ్చి కిటికి భయటకు తొంగి చూసాడు అది తను కలసిన ముసలివాడి ఎడ్లబండి గజ్జెల చప్పుడు అతను ఒక అసామితొ బెరాలు ఆడుతున్నాడు అతను ౫౦౦ అంటే ౮౦౦ వందలకి భేరము కుదుర్చుకున్నాడు.... అతను ఆ మొత్తం కర్రలను ఒక లారి లొకి ఎక్కించి వెలుతుండగా అక్కడకి ఒక కారు వచ్చి ఆగింది అందులొ నల్ల కల్లద్దాలు పెట్టుకున్న ఒక్క మనిషి దిగాడు.... వస్తునే ఏరా బాగున్నావ,, కర్ర కావలి మా అమ్మాయి కొత్త ఇంటికి కావలి నీ దగ్గర ఎన్ని లారిల సరుకు ఉంది అని అడిగాడు అతను ...ప్రక్కనే ఉన్న మూడు లారిలను చూపించి మొత్తం ఐదులక్షలు అవుతుంది అని మీసం దువ్వుతూ అన్నాడు ... అలాగ ఇదిగొ లక్ష అడ్వాన్సు మిగిలినది ఇంటి దగ్గర తీసుకొ అని చెప్పి వెళ్ళిపొయాడు అతను...
ఒక్కసారి తనకు తల తిరిగినంత పని అయింది .. ఏందుకంటే ఆ మొత్తం కర్రలను కొట్టింది తనే . దాని విలువ ఐదు లక్షలు అన్న మాట.. అప్పుడు తనకు అర్దం అయింది ఎమిటి అంటే తనను ఆ ముసలి వాడు మోసం చేస్తే ఆ ముసలివాడిని ఆ లారి వాడు మోసం చేసాడు... ఆ లారివాడిని కారులొ వచ్చిన వాడు కూడ తప్పక మోసం చేసి ఉండాలి... ఎందుకంటే ఇది చిన్న ఊరు ఇక్కడే ఐదు లక్షలు వచ్చింది అంటే అదే పట్నంలొ అయితే ఖచ్చితంగా దాని విలువ ఎక్కువే ఐ ఉండవచ్చు....ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాడు...ఇంతలో బస్సు బయలుదేరింది. కొంచెం దూరం వెల్లిందోలేదో బస్సు ఆగింది. బస్సులోకి పది పన్నెండు మంది అమ్మయిలు ఎక్కారు. అందరూ చాలా అందంగా తనకు కనిపించారు వల్ల మాట తీరులాగే అందంగా కొత్తగా ఉంది మరలా బస్సు బయలుదేరింది. కొండజాలువారు నుండి వీస్తున్న పిల్లగాలులు నన్ను అల్లరిచేస్తు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి వాల్ల ఆటపాటల్లా....నాతో పాటు బస్సులో వున్న వాల్లు కూడా ఆనందిస్తున్నారు. చుట్టూ ఒకసరి తేరిపారగా చూడగా మాతోపాటు ఒక వ్రుద్ద దంపతులు కూడా వున్నారు. పది నిముషాలముందు వాల్లు కూడా ఈ బస్సులో ఎక్కారు. అచ్చు పార్వతీపరమేశ్వరుల్లా నాకంటికి కనిపించారు న తల్లిదండ్రులు కూడా వీరి లానే వుందురేమో అని నా మనసుకి అనిపించింది. తను గీసిన అన్ని చిత్రాలలో ప్రకృతి రమణీయత మద్య వొదిగివున్న తన తల్లిదండ్రుల రూపాలను ఊహించి గీసినవే. తొలిసంధ్య మలిసంధ్యలలో పక్షుల కిలకిల రావాలలో, పారేటి సెలయేటి గలగలలో, నిండు పున్నమి వెన్నెల రాత్రులలో, వర్షపు తొలిచినుకులలో తన ఊహలకు పదును పెట్టిన రోజులెన్నో ఐనా కానరాని వారి రూపం వీరి మాదిరిగా కల్ల ముందు సాక్షాత్కరించింది. రివ్వున వీస్తున్న గాలులలో ఒక చూపు నామనసును పలకరించసాగింది. ఉలిక్కిపడి అటు వైపు చూసా, నావైపే తీక్షణంగా చూస్తున్న ఒక అమ్మాయి కనిపించింది. అప్రయత్నంగా నేను కూడా ఆమె చూపు వైపే ఆకర్షింపబడ్డా. ఇంతలో ఆమె నా వైపే రాసాగింది. ఒక్కసారి నా గుండె చప్పుడు అమాంతంగా పెరిగి పోయింది. దానికి గల కారణం నాకు అర్థమవ్వలేదు. హాయ్ నా పేరు శ్రావ్యలహరి అని నా పక్క సీటులో కూర్చుంది. ఒక్కసారి మనస్సు ఇంద్రధనస్సుని తాకి వచ్చిన అనుభూతి కలిగింది. మరోసారి ఆమె పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డా. ఆమె పిలుపు ప్రకృతి ఒడి నుంచి జాలువారిన పారిజాత పుష్ప సుగంధం వలే శరీరాన్ని ఉత్తేజ పరిచింది. మీరు వేణుగానం కూడా చేస్తారా అని తనకు ఇంతకు ముందు నుంచె పరిచయస్తురాలిలా అడిగింది. నేను ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టేసరికి మీ పేరు ఋషి కదా! మిమ్మల్ని ఈ మధ్యకాలంలో చాలాసార్లు చూసా. ప్రకృతిలో మీరు లీనమై పెయింటింగ్ చేస్తూ కనిపించే వారు ఏదో సృష్టి కార్యం చేస్తున్నట్టు, తరువాత మీగురుంచి తెలుసుకొనగా మీపేరు ఋషి అని మాత్రమే తెలిసింది అంతకి మించి మీ వివరాలు ఏమి తెలియలేదు. అవునా! అని ఆశ్చర్య పోవడం ఋషి వంతు అయింది. ఒక్కసారి ఋషిగారు నాకోసం వాయించరూ అని గోముగా అడిగేసరికి తను కాదనలేకపోయాడు. మధిలో కించిత్ గర్వం ఎందుకంటే ఒక అందమైన అమ్మాయి అడిగేసరికి కొండంత బలం వచ్చినట్టైంది, ఒక్కసారిగా బస్సులో నిశ్శబ్ధం ఆవరించుకుంది. ఆ నిశ్శబ్ధంలో లయబద్దంగా సాగిపోతున్న ఋషి యొక్క వేణుగానం అక్కడ వున్న వారందరిని ద్వాపరియుగ బృంధావన పుర వీధులలో విహార యాత్రకు తీసుకు వెళ్ళినట్టైంది. సాక్షాత్తు ఆ చిన్నికన్నయ్య భువికి దిగివచ్చి వాళ్ళను తన్మయపరచడానికి ఉపక్రమించాడేమో అన్నట్టు ఆనంద డొలికలలో ఊగిలాడసాగారు. ఆ ఆనందాన్ని భగ్నం చేస్తూ పెద్ద శబ్ధం వెనువెంటనే తను స్పృహ కొల్పోవడం రెండూ వెనువెంటనే జరిగిపోయాయి. తనకు తెలిసినంత వరకు చిన్నచిన్న మూలుగులు, పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి గాని తనకి మాత్రం కళ్ళు లేవడం లేదు....ఋషికి తెలియదు తనకి జరిగింది ఎంత పెద్ద
ప్రమాదమో అని....
Part-3
ఋషికి స్ఫృహ వచ్చి చుసేసరికి తను మంచంమీద
పడుకొని ఉన్నాడు. ఎదురుగా కొందరు అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తున్నారు కాని స్ఫష్టంగా
కనిపించలేదు "ఇప్పుడు మీకు ఎలా ఉంది" అన్న
మాటలు అస్ఫష్టంగా వినిపించాయి. కాసేపటికే మగతతో కూడిన ’నిద్ర’ కమ్ముకొచ్చింది. కళ్ళు మూసుకొనేసరికి "అదేరూపం"
కళ్ళముందు కదలాడ సాగింది. ఋషి తనను తానే ప్రశ్నించుకున్నాడు
"ఆమెతో తనకు గల సంబంధం ఎమిటి?" మహా అయితే కొద్ది నిముషాల పరిచయం మాత్రమే. ఒక్క
క్షణకాల బంధంతోనే తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు "తన శరీరంలో సగభాగం
అయినట్టు"
ఎందుకు అనిపిస్తుంది. ఇంతకీ "జరిగిన
ప్రమాదంలో ఆమెకి ఎమైనా జరిగి ఉంటుందా?" అన్న సంశయం రాగానే ఒక్కసారి చిన్నయ్యస్వామిని
స్మరించాడు. స్వామి ఆమెకి ఈ ప్రమదంలో ఏమి
జరగకూడదు, ఆమెను మరలా కలిసేవిదంగా చేయు స్వామి అని కోరుకున్నాడు ఋషి.
ఒక్కసారి తన కళ్ళ ముందు ఒక మెరుపులా వచ్చి తనను మెరుపు వేగంతో ఎదోతెలియని శక్తి
లాగుతున్నట్టు
అనిపించింది. అలా లాగబడిన తన కళ్ళముంధు
సప్తవర్ణాలతో కూడిన లోకం ముందు
సాక్షాత్కరించింది.... "ముందు సన్నని నడక దారి దానికిరువైపులా పచ్చధనంతో
నిండిన వివిద వర్ణాల గడ్డిపూలు,
కంటికి కనిపించినంత మేర ఎత్తుపళ్ళాలతో కూడిన పచ్చికపైర్లు"
కనిపించాయి. ఇంతటి రమణీయమైన ప్రకృతి సోయగాన్ని ఇంతకుముందెన్నడూ చూడలేదు. ఇంతకీ ’ఇది ఏ లోకం నేను ఎక్కడ
వున్నాను’ అని తల ఎత్తి పైకి చూసాడు ఋషి, అద్బుతం తన కలను తనే నమ్మలేకపోయాడు మొత్తం
విశ్వాన్ని అతిదగ్గరగా చూడగలుగుతున్న అనుభూతి "ఇన్ని గ్రహాలు ఈ బ్రహ్మాండంలో
ఇమిడి
ఉన్నాయా అని అనిపించింది" నేను
చూస్తున్నది నమ్మకం కలగక నాశరీరాన్ని తడిమి చూసుకున్నా... "ఆశ్చర్యం నేను
ప్రకాశవంతమైన శ్వేతవర్ణంతో వెలిగిపోతున్నా నాకు రూపం అంటూ లేదు
ఎమిటిది నేను ఎక్కడ ఉన్నాను నా దేహానికి
ఏమైంది. నేను ఈ శ్వేత వర్ణంలోకి ఎలా మారాను! ఇంతటి వెలుతురు ఎక్కడ నుంచి వచ్చింది!
" ఇంతలో నా బస్సులో కనిపించిన వృద్ద దంపతులు
కనిపించారు అంతవరకు నాలో కలిగిన బయం మాయమైంది.
వాల్లు నాకు దగ్గరగా వున్నట్టుంది కాని వారిని నేను చేరలేకపోతున్నా, వాల్లకు వినిపించేటట్టు మనం ఎక్కడ వున్నామండి
అని అడిగా
దానికి వాల్లనుంచి ఏమి సమాదానం లేదు ’బదులుగా’ నా వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి ఎదురుగా కనిపిస్తున్న ఒక
పెద్ద చెట్టుకిందకి వెళ్ళి ఒకరిపక్కన ఒకరు కూర్చొని ఒకరిలో ఒకరు ఐక్యం
అయిపోయారు.... ’నా కలను నేనే నమ్మలేకపోయా’ వాళ్ళు కూర్చున్న చోటే చిన్న వెళ్తురులాంటి నక్షత్ర
బిందువులా అంతర్దానం అయిపోయారు.....
ఇంతలో నా ప్రక్కగా ఒక ఆకారం వెల్లడం గమనించి
"ఎవరక్కడ?" అని అన్నా...ప్రతిగా "ఋషి" అన్న
పిలుపు వినిపించింది. ఆ పిలుపు తనకు సుపరిచితం అవును అది "చిన్నయ్యస్వామిది".
చుట్టూ
చూసా ఎవరూ కనిపించలేదు... "స్వామీ మీరు
ఎక్కడ వున్నారు?", "నేను ఎక్కడ వున్నాను?" ఏమిటీ వింత? నాకు మీరు కనిపించడం లేదు అని ఆర్తితో నిండిన గొంతుతో
అన్నాడు ఋషి. నాయనా
నీకు ఎదురుగా కనిపిస్తున్న చెట్టు వద్దకి రా
అని వినిపించింది. తను అలానే తనకు కనిపించిన చెట్టు వద్దకు వెళ్ళి ఇంతకు ముందు
నక్షత్ర బిందువులో అంతర్దానమైన స్థలానికి కొంచెం దూరంలో ఆగా..
’ఆ స్థలం ప్రకాశవంతంగా కాంతులు విరజిమ్ముతుంది...’ అయినను తనకు చిన్నయ్యస్వామి తనకు
కనిపించలేదు....
చూడు నాయనా ఋషి ’నీవు అచేతన అవస్థలో వున్నావు...కాని నీవు చనిపోలేదు’... నేను చనిపోయినను నీ మధిలో నేను జీవించే
వున్నాను కాబట్టి నా మాటలు నేనే స్వయంగా
మాట్లాడినట్టు ఉంది...అయినను నీకు నేను మాట
ఇచ్చాను కాబట్టి నా ఆత్మ నీచుట్టూ పరిబ్రమిస్తూనే ఉంటుంది...ఇది ఈశ్వరేచ్చ.
తనయొక్క కృప నీమీద ఎల్లప్పుడూ ఇలానే ఉంటుంది.
"నీవు కారణ జన్ముడువి". నేను నిన్ను పశికందుగా చూసిన రోజే గుర్తించాను
"నీవు ఈశ్వర వరపుత్రుడవని" నిన్ను తన బంటుగా మానవ
జాతికి మేలు చేయుటకై ఈ భూమి మీదకు
పంపినాడు...నీవు తన ధూతవు నీకు శక్తులు ఉండకపోవచ్చు కాని పరులకి మేలుచేయాలన్న
"సంకల్పమే" నీ "శక్తి". నీవు మనవమాత్రుడవే. నీవు
కష్టనష్టాలను భరించ వలసినదే, సకల జనులని పాలించే ఆ పరమేశ్వరుడికే తప్పలేదు
కనుక నీవు బ్రతుకుతూ పదిమంది మంచి కోరుతూ ఇకపై నీ జీవనాన్ని సాగించు.
ఈ లోకంకి ప్రతి జీవి ఏదో ఒక సమయంలో వచ్చే
తీరుతాడు. ఇది ప్రకృతి తన బిడ్డకై నిర్మించిన సుందర అద్భుత ఊహాలోకం ఇక్కడ తమపర
భేధాలు లేవు మంచి చెడులకి తావు లేదు ఆకలి దప్పులు అస్సలు ఉండవు ఇది ప్రతి జీవికి
"ఆవాసయోగ్యం". ఇంతకూ కనిపించి అంతర్ధానమైన ఆ వృద్ద ధంపతులు ఎమయారు
స్వామి అని అడీగాడు ఋషి...చూడు నాయనా వాల్లు తమ శరీరాలను విడిచిపెట్టిన పుణ్యదంపతులు, ఒకరిని ఒకరు విడిచి జీవించలేని
అర్థనారీశ్వరులు. వాళ్ళు ఈ ప్రకృతిలో పుట్టిన పుణ్యదంపతులు "జగతికి
ఆదర్శప్రాయులు" గనుకనే ఒకే సమయంలో ప్రాణాలు వదిలి ఒకరిలో ఒకరు
ఐక్యమైపోయారు....
ఋషి ఇది నీ లోకం నీకు మట్టుకే సొంతమైన నీ
సుందర ఊహాలోకం ఇందులోకి నీకు కావలసిన, నచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రవేశం. ఇది నీకు
మట్టుకే సృష్టించబడిన సుందర విశ్వం ఆనందించు. ఇక్కడ నీకు కావాలి అంటే నీ
తల్లిదంద్రులని సృష్టించుకో నీవే భగవంతుడవి నీవు అనుకున్నది అవుతుంది అని అనగానే
నాలో "కల్పన" మొదలయింది... అంతే ఒక్కసారి కనిపించినంతమేర ఇసుక
తిమ్మెరులతో కూడిన ప్రశాంతమైన సముద్రం, నీలినింగితో కూడిన ఆకాశం ప్రత్యక్షమైంది. ఆ నీళ్ళు ఎంత
స్వచ్చంగా వున్నాయంటే నీల్ల కింద మరోప్రపంచం ఉంది అనే బ్రమ కలిగించేటట్టు...
ఎదురుగా చూసా సముద్రం నింగి కలిశే చోట "శ్రావ్యలహరి" రూపం...
ప్రకృతి విశ్వాంతరాలలో... భూమి సౌంధర్యానికి
మురిసి ...స్త్రీగా జన్మించినదో...
లేక నక్షత్రమండలి నందు జలముగా జాళువారి
ప్రకృతిగా రూపమొందినదో...
ఏమి అందమిది కన్నీటి బొట్టులో కనిపించిన
కాంతిలాగ ...
అందున మెరిసిన నాచెలి చిరునవ్వులాగ, అందముకే అర్దం చెప్పే వెన్నెల కూడా మురిసి...
తన వెన్నెల కాంతులను ఆమె అదరమునందు
ప్రసరింపజేసెనో...
ప్రకృతిలోని అందాన్ని సింగారింప చేసెనో...
ఉదయపు మంచు భిందువుల చాటున పెరిగిన
గడ్డిపువ్వులా...
ప్రకృతి ఒడిలో పెరిగి... నా మధిలో మెదిలిన నా
ఊహాసుందరి నా ప్రియసఖి "అవునా"...
లేక ప్రకృతి కన్యలా ప్రకృతియందు ఇమిడిపోవునా...
ఏమి? ఋషి తను నీకు నచ్చిందికదూ అన్న మాటలకు ఉలిక్కిపడ్డాడు. చూడు
ఋషి ఈ లోకంలో ప్రతిఒక్కరు తన గురుంచి ఆలోచించుకొనే వారే ఎక్కువ. నీవు కూడా వాళ్ళలో
ఒక్కడివిగా మిగిలిపోతావో లెక తోటి అరికి సహాయపడి అందులో నిన్ను నీవు సంతోష
పెట్టుకుంటావో ఇకపై నీ చేతులలో ఉంది. ఈ విషయంలో మాత్రము నీవు రాల్లదారిలో నడవవల్సి
వస్తుంది.
No comments:
Post a Comment